విష్ణుప్రియ ఫీలింగ్స్...పృథ్వీ అంటే వ్యామోహం, క్రష్..
on Dec 10, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరంటే ఠక్కున విష్ణుప్రియ అని చెప్పేస్తారు. సండే రోజు ఎలిమినేషన్ అయిన విష్ణుప్రియ.. బజ్ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది.
నేను ఎవర్నైనా ఇష్టపడితే బంగారంలా చూసుకుంటా. నాకు ఎవరైనా నచ్చారంటే ఇలాగే చూసుకుంటా. నాకు పృథ్వీ అనే వ్యక్తి చాలా నచ్చేశాడు. ఫ్రెండ్ కంటే ఎక్కువ. ధైర్యంగా ఈ మాట చెప్తున్నా.. అతను నాకు నచ్చాడు.. నాకు నచ్చితే ఇలాగే ఉంటా. ఫ్రెండ్ కంటే ఎక్కువ అంటే అతనంటే నాకు వ్యామోహం, క్రష్. ఫ్రెండ్ కంటే ఎక్కువ.. లవర్ కంటే తక్కువ అని కూడా చెప్పలేను. నా హృదయానికి దగ్గరైన పర్సన్ పృథ్వీ. అతనంటే నాకు ఎంత ఇష్టం అంటే.. బయటకు వచ్చిన తరువాత పృథ్వీ గురించి పూర్తిగా తెలుసుకుని మేం ఇద్దరం కలిసి జర్నీ చేసి.. అన్నీ కుదిరితే ప్రేమిద్దామని అనుకున్నాను. అది అవ్వదని క్లారిటీ ఉంది.
ఎందుకంటే.. అతనికి నా పర్సనాలిటీ ఇష్టం లేదు. వేరే పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. నాక్కూడా వేరే పర్సనాలిటీ ఉన్న అబ్బాయిలంటే ఇష్టం కానీ.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత పృథ్వీ నచ్చాడు. ఆ ఎడారిలో నా హీరో అంటే పృథ్వీనే. అతనిలో ఏది నచ్చిందంటే సర్వం ఇష్టమే. అతనికి నేనంటే ఇష్టం లేదని అన్నాడు. కానీ.. నాకు నచ్చాడంతే. అతనికి నచ్చానా లేదా అన్నది కాదు.. నాకు నచ్చితే నేను ఇలాగే ఉంటా. అతన్ని కూడా అడిగాను.. నీకు నచ్చేట్టుగా నేను ఏమైనా మార్చుకోవాలా? అని. నీకు నీ మీద క్లారిటీ ఉంటే ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకోమన్నప్పుడు.. ఎవరెవరో సాంగ్ పాడినప్పటి నుంచి నాకు అతనిపై వ్యామోహం కలిగింది. ఇలాంటి వాడితో బయటకు వెళ్లిన తరువాత డేట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కానీ అతనికి నాలాంటి అమ్మాయి ఇష్టం లేదని. నాక్కూడా అలాంటి అబ్బాయి సెట్ కాడని క్లారిటీ ఉంది. కానీ ఆ వ్యక్తిని ఆస్వాదించి.. ఆ వ్యక్తితో అన్ని మూమెంట్స్ టైం స్పెండ్ చేయగలనో అన్నీ చేయాలనే క్రష్ ఉంది.
అతనికి ముద్దులు పెట్టానంటే.. నాకు తెలిసిన విష్ణు ప్రియ అందరికీ ముద్దులు పెడుతుంది. ఓవర్ అయ్యిందని అయితే నేను అనుకోను. అతను వద్దంటున్నా.. నేను కావాలని వెళ్తున్నట్టు అనిపించిందేమో. కానీ నేను ఫోర్స్ ఫుల్ చేయలేదు. రాత్రి పూట తను ఏడుస్తున్నాడని రెండుసార్లు ముద్దులుపెట్టాడు. తను వెరీ కిస్సీ.. వెరీ హగ్గీ పర్సన్. అందుకే ముద్దులు పెట్టా’ అంటూ నిస్సిగ్గుగా ఏ మాత్రం సిగ్గులేకుండా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఏవిధంగా అయితే దిగజారి ప్రవర్తించిందో.. బిగ్ బాస్ బయటకు వచ్చిన తరువాత కూడా తాను ఇలాగే ఉండబోతున్నానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది విష్ణు ప్రియ. ఏమాటకామాటే కానీ.. విష్ణు ప్రియ మాత్రం మిగతావాళ్లలా లోపల ఒకటి బయటకు మరొకటి మాట్లాడదు. లోపల ఏమున్నా ఇదిగో ఇలా సిగ్గులేకుండా కక్కేస్తుంటుంది.
Also Read